ETV Bharat / jagte-raho

భార్యను హత్య చేసి ఓసీ గనిలో పూడ్చేసిన భర్త

భార్యని హత్యచేసి వంద మీటర్ల లోతులో పాతి పెట్టాడు ఓ భర్త. వివాహేతర సంబంధం, ఆస్తి తగాదాల వల్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలి భర్త తీరుతో పోలీసులకు అనుమానం రాగా.. దర్యాప్తు ముమ్మరం చేశారు. కుళ్లిన స్థితిలో వివాహిత మృతదేహం లభ్యమైంది.

woman murdered by her husband in bhadradri kothagudem district
దారుణం: భార్యను హత్య చేసిన భర్త... ఆస్తి కోసమేనా?
author img

By

Published : Dec 13, 2020, 4:28 PM IST

Updated : Dec 13, 2020, 5:39 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అదృశ్యమైన ఓ వివాహిత హత్యకు గురైందని పోలీసులు తెలిపారు. ఆమె భర్త తీరుతో అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. వంద మీటర్ల లోతులో మృతదేహాన్ని గుర్తించారు. ఇల్లందు ఉపరితల గని ప్రాంతంలో టేకులపల్లి మండలం హనుమ తండాకు చెందిన వివాహిత గుగులోతు మంగ ఈ నెల 2న అదృశ్యమైంది. ఆమె సోదరుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆమె భర్త భాస్కర్ హత్య చేసినట్టు తెలుసుకొని ఆదివారం ఉదయం నుంచి ఉపరితల బొగ్గు గని ప్రాంతంలో పోలీసులు తనిఖీ చేశారు. అతను ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని పడేసిన ప్రాంతంలో గాలించగా కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం లభ్యమైందని తెలిపారు. మూతపడిన ఉపరితల గని ప్రాంతంలో వంద మీటర్ల లోతులో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మెడకి చీరని బిగించి ఉరివేసి చంపినట్టు తెలుస్తోందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 12 రోజుల క్రితం హత్యకు గురైన మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు.

మృతురాలి భర్తకి వివాహేతర సంబంధాలు ఉన్నాయని.. ఆ కారణంగా తరుచూ గొడవలు జరిగేవని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ కలహాలు, ఆస్తి గొడవలతో ఆమె భర్త, అతని తమ్ముడు కలిసే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. నాన్న, బాబాయిలే తమ తల్లిని చంపారని మృతురాలి కూతురు రోదిస్తోంది. తమ బాబాయి పేరు మీద ఉన్న 30 గుంటల టేకు తోట కోసం ఘర్షణలు జరిగినట్లు తెలిపింది.

అన్నం ఫౌండేషన్ కృషి

వివాహిత ఆచూకీ కోసం గాలింపు చర్యల్లో అన్నం ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. అన్నం శ్రీనివాసరావు వారి బృందం పోలీసులతో కలిసి వంద మీటర్ల లోతులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు.

ఇదీ చదవండి: కూలీల ఇంట విషాదం.. మృతదేహాలతో ధర్నా

Last Updated : Dec 13, 2020, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.