కర్ణాటక రాష్ట్రం కలబురిగి పట్టణం నుంచి శ్రీదేవి (45) కొన్నేళ్ల క్రితం కాళ్లకల్‌కు వచ్చి దాబాలో పాచిపని చేసుకుంటూ అక్కడే ఉంటూ జీవనం సాగిస్తోంది. లాక్‌డౌన్‌తో దానిని మూసేశారు. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. చేయడానికి పని కరవైంది. తినడానికి తిండి దొరకలేదు. ఒకరోజు తింటే రెండు రోజులు పస్తులు ఉండేది. ఈ క్రమంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురై మంచం పట్టి.. చివరికి శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది.
ఇదీ చూడండి: 'చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒక 'ధూర్త శక్తి''