వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంటలో 9 మందిని హత్య చేసిన నిందితుడు సంజయ్‌కుమార్‌ను పోలీసులు వరంగల్ జిల్లా కోర్టులో హాజరపరిచారు. మే 30న విచారణ కోసం నిందితుడు సంజయ్‌ను గీసుగొండ పోలీసులు వరంగల్ కేంద్ర కారాగారం నుంచి 6 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ ముగియడంతో నేడు హన్మకొండలోని జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు.
నిందితుడు సంజయ్‌కు జిల్లా కోర్టు 14 రోజుల వరకు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు నిందితుడ్ని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. 9 మందికి ఆహారంలో నిద్రమాత్రలు కలిపి మత్తులోకి జారుకున్నాక.. ఒకరి తర్వాత ఒకరిని బావిలో వేసినట్లు నిందితుడు సంజయ్ చెప్పినట్లు తెలుస్తోంది.