ETV Bharat / jagte-raho

ఆర్థిక ఇబ్బందులు, భర్త వేధింపులతో వివాహిత బలవన్మరణం - vra wife suicide at patancheru in sangareddy district

కరోనా నేపథ్యంలో లాక్​డౌన్​ అమలైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య కుటుంబకలహాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆపై ఆర్థిక ఇబ్బందులు తోడై విరక్తి చెందిన ఓ వీఆర్​ఏ భార్య ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం చిట్కుల్​ గ్రామంలో జరిగింది.

vra wife suicide at patancheru in sangareddy district
కుటుంబకలహాలు, ఆర్థిక ఇబ్బందులకు ఆత్మహత్యే పరిష్కారమనుకుంది!
author img

By

Published : Jul 4, 2020, 5:41 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం చిట్కుల్​ గ్రామానికి చెందిన ఓ వీఆర్​ఏ భార్య కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడింది. చిట్కుల్లో వీఆర్​ఏగా పనిచేస్తున్న అశోక్​ భార్య సుమలత.. ఓ పరిశ్రమలో పనిచేస్తోంది. లాక్​డౌన్​ సడలింపులతో పరిశ్రమకు వెళ్తున్న సుమలతను పనికి వెళ్లవద్దని చెప్పి మాన్పించాడు. దీనికి తోడు ఇంటి ఖర్చులకు డబ్బులు కూడా ఇవ్వకుండా మద్యం తాగేవాడు.

ఈ విషయమై భార్యభర్తలిద్దరూ తరచూ కొట్లాడుకోగా... మూడురోజుల క్రితం ఈ వివాదాన్ని బంధువులు సర్దిచెప్పారు. జీవితంపై విరక్తి చెందిన సుమలత... శనివారం తెల్లవారుజామున ఇంట్లో దూలానికి తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం పటాన్​చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.