సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన తిప్పర్తి గౌరయ్యకు, మరో వ్యక్తికి గొడవ జరుగుతుండగా పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో గౌరయ్య కింద పడి మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ కొట్టడం వల్లే గౌరయ్య మృతిచెందాడంటూ గ్రామస్థులు స్టేషన్ ముందు బైఠాయించారు. పెద్ద ఎత్తున తరలొచ్చి ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గజ్వేల్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండి:వారికి స్మార్ట్ఫోన్లే లేవ్- మరి ఆన్లైన్లో చదువెలా?