రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏటీఎం చోరీకి దుండగులు యత్నించారు. యూనియన్ బ్యాంక్ ఏటీఎం దోచుకోవడానికి గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి విఫలయత్నం చేశారు. ఏటీఎంలోకి అర్ధరాత్రి చొరబడిన దుండగుడు చోరీ కోసం యత్నించగా... అదే సమయంలో బ్యాంక్ సైరన్ మోగడంతో పారిపోయారు. ఈ దృశ్యాలన్నీ ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి: పెళ్లి రోజు.. సవతి కుమార్తెలను చంపి తానూ ఆత్మహత్య