మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలకు భాగ్యనగరం నీట మునిగింది. కాగా పలువురు గల్లంతయ్యారు. గురువారం హైదరాబాద్ సైదాబాద్ పరిధిలోని సింగరేణి పార్కు వద్ద వరదనీటిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని శవాన్ని జేసీబీ సహాయంతో బయటకు తీశారు. మృతుడు మాదన్నపేట కుర్మగూడ త్రీటెంపుల్ ప్రాంతానికి చెందిన ఎండీ అహ్పస్ ఉల్లాఖాన్గా అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: పానీపూరీ తినేందుకు వెళ్లి గల్లంతైన యువకులు మృతి