నాగర్కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం తిమ్మన్నపల్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన ఎకరా కందిపంటకు నిప్పుపెట్టారు గుర్తుతెలియని దుండగులు. చిన్న బాలయ్య అనే రైతు తన ఎకరా విస్తీర్ణంలో కందిపంటను సాగుచేశారు. మరో వారం రోజుల్లో పంట చేతికోస్తుందనుకునే లోగా మంటల్లో కాలి బూడిదైంది.
చేతికొచ్చిన పంట కళ్లముందే దగ్ధమవుతుంటే రైతన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిప్పుపెట్టిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరారు. కష్టపడి పండించిన పంట మంటల్లో కాలిపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.