ETV Bharat / jagte-raho

వరసకు కూతురైన మైనర్​ను గర్భవతి చేసిన బాబాయ్​

వరసకు కూతురైన మైనర్​ను బాబాయే గర్భవతిని చేసిన ఘటన మహబూబాబాద్​ జిల్లాలోని ఓ మారుమూల తండాలో జరిగింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసునమోదు చేసినట్లు సమాచారం.

girl raped by her uncle
వరసకు కూతురైన మైనర్​ను గర్భవతి చేసిన బాబాయ్​
author img

By

Published : Nov 26, 2020, 7:20 AM IST

వరసకు కూతురైన మైనర్​పై అత్యాచారం చేసి.. గర్భవతిని చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని ఓ మారుమూల తండాలో చోటుచేసుకుంది.

13 ఏళ్ల బాలిక మహబూబాబాద్​ పక్క జిల్లాలో చదువుతోంది. కరోనా ప్రభావంతో పాఠశాలకు సెలవులు ఇవ్వడం వల్ల.. వరసకు బాబాయ్​ అయిన వ్యక్తి ఇంటి వద్ద ఉంటోంది. బాలికను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పకుండా దాచిపెట్టింది.

మంగళవారం.. బాలిక కళ్లు తిరిగి పడిపోయింది. హుటాహుటిన మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆమె తల్లిదండ్రులు. బాలికను పరీక్షించిన వైద్యులు గర్భవతి అని నిర్ధారించారు. బాధితురాలని తీవ్రంగా మందలించడం వల్ల.. ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి వివరాలు చెప్పింది. కురవి పోలీస్​ స్టేషన్​లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో​ కేసు నమోదుచేసినట్లు సమాచారం.

ఇవీచూడండి: కాకినాడలో దారుణం... నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.