నిర్మల్ జిల్లాలోని రెండు చోట్ల వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఇద్దరు ద్విచక్రవాహన దొంగలు పట్టుబడ్డారు. లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ గ్రామం వద్ద పోలీసులు సోదాలు చేపట్టగా మామడ మండలం కిషన్ రావుపేట్ గ్రామానికి చెందిన వెంకటరమణ (38) అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని ఆపి వాహనానికి సంబంధించిన పత్రాలు చూపమనగా లేవనడం వల్ల నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు కొట్టేసిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై యూనుస్ మహమ్మద్ అలీ పేర్కొన్నారు.
అలాగే సోన్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన తోట మహేందర్ ద్విచక్రవాహనం దొంగతనానికి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేరోజు మండల కేంద్రంలో పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి చోరీ చేసిన అదే ద్విచక్రవాహనంపై వెళ్తూ కనిపించాడు. దానితో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండీ... అనంతపురం - న్యూదిల్లీ మధ్య కిసాన్ రైలు ప్రారంభం