ETV Bharat / jagte-raho

దారుణం: ఆస్తి కోసం అమ్మనాన్నలకే చెప్పుల దండ

పైసా మే పరమాత్మ అని అందరూ అంటారు. ఆ పైసల కోసం ఎంత దారుణానికైనా ఒడిగడుతారు కొందరు. ఆస్తి పంచివ్వడం లేదనే అక్కసుతో కనిపెంచిన అమ్మనాన్నలనే తీవ్ర అవమాన పరిచారు ఇద్దరు కొడుకులు. తమ అనంతరం ఆస్తి పంచుకోవాలని చెప్పినా... వినకుండా వారిని నానా హింసలకు గురి చేస్తున్నారని ఆ వృద్ధ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

two sons harass their parents for assets distribution in suryapet district
దారుణం: ఆస్తి కోసం అమ్మనాన్నలకే చెప్పుల దండ
author img

By

Published : Dec 16, 2020, 1:38 PM IST

తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు. కానీ ఆస్తికోసం జన్మనిచ్చిన తల్లిదండ్రుల చిత్రపటాలకు చెప్పుల దండ వేసి అవమానపర్చారు ఇద్దరు ప్రబుద్ధులు. తండ్రిని బలవంతగా తీసుకెళ్లి ఆస్తిని వారి పేరున రాయించుకున్నారు. తల్లి ఫిర్యాదుతో ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నూనె సంజీవరావు, సరోజ దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. వారందరికీ వివాహం అయింది. తహసీల్దార్​గా ఉద్యోగం చేసి విశ్రాంతి తీసుకొని సంజీవరావు సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు. ఆయన సొంత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో వారికి సాగు భూమి ఉంది. హైదరాబాద్​లో ఓ ప్లాటు ఉంది.

ఆస్తి పంచాలంటూ ఆయన కుమారులైన రవీందర్, దయాకర్ కొన్నాళ్లుగా ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆ వృద్ధ తల్లిదండ్రులు వాపోయారు. ఎలక్ట్రీషియన్​గా పని చేస్తున్న మూడో కుమారుడు కరుణాకర్ వద్ద సంజీవరావు దంపతులు నివాసం ఉంటున్నారు. చిన్నకుమారుడికే ఆస్తి అంతా ఇస్తారనే అనుమానంతో పలుసార్లు బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఇప్పటికే కొంత ఆస్తిని పంపకం చేశాం. మిగిలిన ఆస్తిని మా తర్వాత తీసుకోవాలని చెప్పాం. దీనికి అంగీకరించకుండా మా ఇద్దరు కొడుకులు చాలాసార్లు గొడవ పడ్డారు. ఆస్తి దక్కడం లేదన్న కోపంతో మా ఫొటోలకు చెప్పుల దండ వేసి బంధువులకు వాట్సాప్ మెసేజ్​ల ద్వారా పంపించి అవమాన పరిచారు. ఈనెల 14న అర్ధరాత్రి వారి తండ్రిని బలవంతంగా తీసుకెళ్లి ఆస్తిని తమ పేరున రాయించుకున్నారు."

-సరోజ , బాధితురాలు

కుమారుల అరాచకాలను ఇన్నాళ్లు భరించిన తల్లిదండ్రులు చేసేదిలేక చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి వృద్ధ దంపతుల ఇద్దరు కుమారులు, ఇద్దరు మనవళ్లపై సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: కిల్లర్ అల్లుడు.. ఆస్తి కోసం అత్తామామలను చంపేశాడు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.