ETV Bharat / jagte-raho

అప్పుల బాధతో ఒకరు, కుటుంబ కలహాలతో మరొకరు ఆత్మహత్య - two persons suicide in siddipet district

అప్పుల బాధ తాళలేక ఒకరు ఆత్మహత్య చేసుకుంటే.. కుటుంబ కలహాలతో మరొకరు తనువు చాలించారు. క్షణ కాలంలో తీసుకున్న నిర్ణయాలతో రెండు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

two-persons-have-committed-suicide-in-siddipet-district
అప్పుల బాధతో ఒకరు, కుటుంబ కలహాలతో మరొకరు ఆత్మహత్య
author img

By

Published : Sep 26, 2020, 7:58 AM IST

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ తాళలేక కోనాయిపల్లి గ్రామానికి చెందిన శివోల్లా స్వామి, కుటుంబ కలహాలతో సూరంపల్లి గ్రామానికి చెందిన రాజాగౌడ్​లు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

కోనాయిపల్లికి చెందిన శివోల్ల స్వామి తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో పంటలు సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవలే కూతురు వివాహం జరిపించాడు. ఈ క్రమంలో పంట కోసం, కూతురు పెళ్లి కోసం చేసిన అప్పులు పెరిగిపోవటం వల్ల మనస్తాపం చెందిన స్వామి.. గురువారం సాయంత్రం తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలానికి వెళ్లిన స్వామి రాత్రయినా ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు గ్రామంలో విచారించగా ఫలితం లేకపోయింది.

శుక్రవారం పొలం వద్ద చెట్టుకు వేలాడుతున్న స్వామిని గుర్తించిన చుట్టుపక్కల రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కుటుంబ కలహాలతో మరొకరు..

సూరంపల్లి గ్రామానికి చెందిన రాజా గౌడ్ గీత కార్మికునిగా పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత నెల రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజా గౌడ్ శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీకి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి: చేను పని చేసుకుంటున్న మహిళను బలి తీసుకున్న పిడుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.