షీల్ సంస్థకు చెందిన నకిలీ తాళాలు తయారు చేస్తున్న ఇద్దరిని మధ్య మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 3 లక్షల 10 వేల విలువైన 525 నకీలీ తాళాలను స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్ కవాడిగూడ, హబ్సిగూడ ప్రాంతాలకు చెందిన గుర్రం రమణరావు, యాదగిరి మరో ఇద్దరు కలిసి దుకాణం షట్టర్లు, వాటి విడి భాగాల వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారం వల్ల వచ్చే ఆదాయం సరిపోలేదు. దీంతో తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని భావించిన నలుగురు కలిసి.. షీల్ సంస్థకు చెందిన తాళాలను తయారు చేయడం ప్రారంభించారు.
సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల దుకాణాలపై దాడి చేసి రమణరావు, యాదగిరిలను పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారయ్యారని.. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లాడు.. సొత్తు అంతా కాజేశాడు