ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ముళ్లకట్ట వద్ద ఇద్దరు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు జిలెటిన్ స్టిక్స్, రెండు డిటోనేటర్లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని ఏటూరు నాగారం ఏఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
మావోయిస్టు పార్టీకి ఆకర్షితులైన బంధం వేణు, ఆలెం రవి... కొరియర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. మావోయిస్టు అగ్రనేతలైన హరిభూషన్, దామోదర్ ఆదేశాలపై వారికి కావాల్సిన నిత్యావసర సరకులు... పోలీసుల సమాచారం చేరవేస్తున్నరన్నారు. బంధం వేణు గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి అనారోగ్యంతో 2008లో లొంగిపోయాడని ఏఎస్పీ తెలిపారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: గుడి దొంగలను పట్టుకున్న లంగర్ హౌస్ పోలీసులు