ETV Bharat / jagte-raho

క్రికెట్ బెట్టింగ్​లో నష్టం.. ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం - ఏపీలో ఐపీఎల్ బెట్టింగ్

ఏపీ గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం త్యాళ్లూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్​లో భారీగా నష్టపోయిన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు ప్రయత్నించగా.. ఒకరు మృతి చెందారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.

క్రికెట్ బెట్టింగ్​లో నష్టం.. ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Nov 11, 2020, 5:30 AM IST

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్​లో దిగి భారీగా నష్టపోయిన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. వీరిలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం త్యాళ్లూరు గ్రామానికి చెందిన ఊర ఐలోని కుమారుడు సురేష్ (22), బెల్లంకొండ బుడగ జంగాల కాలనీకి చెందిన ఊర శంకర్ కుమారుడు కొమురయ్య(21) సోమవారం మధ్యాహ్నం బెల్లంకొండలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. అప్పటికే దారిలో పురుగుల మందు తాగారు.

క్రికెట్ బెట్టింగ్ లో రూ. లక్షల్లో నష్టపోయామని.. డబ్బులు చెల్లించాలని బెట్టింగ్ నిర్వాహకుడు ఒత్తిడి తేవడం వల్ల చనిపోవాలని నిర్ణయించుకుని పురుగుల మందు తాగుతున్నామంటూ చేసిన వీడియోను బంధువులకు వాట్సాప్ లో పంపించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు ఇద్దరిని సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు.. అక్కడ నుంచి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం సురేష్ చనిపోగా.. కొమురయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి: ప్రేమించిన వాడే కడతేర్చాడు..రెండేళ్ల తర్వాత నిందితుడు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.