నూతనంగా నిర్మిస్తున్న భవనంలోని నీటి సంపులో మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమార్ బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు చింటూ(22), కోటేష్(25) నాగర్ కర్నూల్ జిల్లా వాసులని ఆ ఇంటి యజమాని తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసి ఇంటి యజమాని అలీమ్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చదవండి: అతని ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమా?