ETV Bharat / jagte-raho

లైవ్​ వీడియో: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి

అప్పుడే పని ముగించుకుని ఇంటికి వెళ్దామని బండి తీసిన ఆ మాస్టర్​... రోడ్డు కూడా దాటకుండానే లోకం విడిచివెళ్లిపోయాడు. మెరుపు వేగంతో స్కూటీ రావటం... రెండు వాహనాలు ఢీకొనటం... ఇద్దరు వ్యక్తులు ఎగిరిపడటం... ప్రాణాలు కోల్పోవటం... అంతా చూస్తుండగానే జరిగిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి.

two died in bike accident at abids cctv footage

author img

By

Published : Sep 23, 2020, 9:35 AM IST

Updated : Sep 23, 2020, 10:14 AM IST

హైదరాబాద్ అబిడ్స్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. అబిడ్స్​లోని జీపీవో దగ్గర్లోని కృపా టిఫిన్ సెంటర్​లో పనిచేసే మాస్టర్... తన పని ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా.. అటువైపు నుంచి వేగంగా వచ్చిన స్కూటీ... బలంగా ఢీకొనటం వల్ల మాస్టర్​ అక్కడికక్కడే మృతి చెందాడు. స్కూటీ నడిపేవ్యక్తి తీవ్రంగా గాయపడగా... ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్కూటీ వాహనదారు సైతం ప్రాణాలు విడిచాడు. ఒళ్లు గగ్గుర్పొడితే ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో నిక్షప్తమయ్యాయి.

మృతుల్లో ఒకరు బీదర్​కు చెందిన నర్సింగరావు, మరొకరు ఓల్డ్​సిటీకి చెందిన మహ్మద్​ కగల్​గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం, రాంగ్​రూట్​, హెల్మెట్​ ధరించకపోవటమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధరించారు.

లైవ్​ వీడియో: రెండు ద్విచక్రవాహనాలు ఢీ... అక్కడికక్కడే ఇద్దరు మృతి

ఇదీ చూడండి: ప్రియుడి మోజులో పడి భర్త ప్రాణాలు తీసిన భార్య

Last Updated : Sep 23, 2020, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.