ట్రాక్టర్ ట్రాలీల చోరీకి పాల్పడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా మోతె పీఎస్ పరిధిలో వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.13 లక్షల విలువైన ఎనిమిది ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు.
లాక్డౌన్ కారణంగా ఉపాధిలేక చోరీలకు అలవాటు పడ్డారని సీఐ శ్రీనివాసులు వెల్లడించారు. సూర్యాపేట మండలం కేసారం గ్రామానికి చెందిన యువకులు జల్సాలకు అలవాటుపడి డబ్బుల కోసం దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.