ETV Bharat / jagte-raho

టాటా బొలెరో బోల్తా... 18 మందికి గాయాలు - Road accidents in Telangana

Trolley auto rolled over at angadi Kistapur, Siddipet district
టాటా బొలెరో బోల్తా... 18 మందికి గాయాలు
author img

By

Published : Jan 4, 2021, 12:49 PM IST

Updated : Jan 4, 2021, 2:43 PM IST

12:46 January 04

టాటా బొలెరో బోల్తా... 18 మందికి గాయాలు

వారంతా కూలీ పనులు చేసుకునేవాళ్లు. పనికెళ్తే కానీ... రెండు పూటలా తినలేరు. అలా రోజులానే టాటా బొలెరోలో  వెళ్లారు. ఒక్కసారిగా బండి అదుపుతప్పింది. ఈ ఘటనలో 18 మంది హమాలీలకు గాయాలయ్యాయి.  ఈ ప్రమాదం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్ వద్ద చోటుచేసుకుంది.

వీరంతా అక్కారం బియ్యం గోడౌన్​లో పనిచేస్తున్న బీహార్​కు చెందిన వలస కూలీలు. చేబర్తి నుంచి అంగడి కిష్టాపూర్​ వైపు వస్తుండగా వాహనం అదుపుతప్పి.. ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 18 మందిలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై శ్రీశైలం తెలిపారు. వీరిని చికిత్స నిమిత్తం గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీశైలం పేర్కొన్నారు. 

Last Updated : Jan 4, 2021, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.