ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెనుగొండ మండలం హరిపురం 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో త్రిపుర రాష్ట్రానికి చెందిన బీతా అనే మహిళ మృతి చెందగా.. మరో 8 మంది గాయాలపాలయ్యారు. గాయపడిన వారందరూ స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్లో పని చేస్తున్న వారని పోలీసులు తెలిపారు. వీరంతా గొల్లపల్లి జలాశయాన్ని చూసేందుకు వెళ్లి, తిరుగు ప్రయాణమవ్వగా.. పెనుగొండ కూడలి వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న ఆటోను కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బీతా అనే త్రిపుర మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనలో గాయాలుపాలైన వారందరిని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆటో డ్రైవర్ దాదా పీర్ పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. ఘటనపై కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: బోగత జలపాతం వద్ద మృతదేహం లభ్యం