కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంటలో పండుగపూట విషాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ట్రాక్టర్ అదుపుతప్పి కందకూరి సాగర్ ఇంటి గోడను ఢీ కొట్టింది. ఈ ఘటనలో గోడ కూలిపోయింది. అదేసమయంలో గోడ దగ్గర ఉన్న సాగర్‌పై గోడ పడగా... తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
క్షతగాత్రున్ని హుటాహుటిన అంబులెన్స్‌లో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి భార్య శ్యామల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.