సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో 3 సంవత్సరాల పాప మృత దేహం లభ్యమైంది. పాప అదే గ్రామానికి చెందిన కటిక కుర్బుగా గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పాప మృతికి కారణాలేంటని తెలియాల్సి ఉందని కొండాపూర్ ఎస్సై రాజు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.
ఇదీ చూడండి: ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య