ఓ ఇంట్లో జరుగుతున్న నూతన వస్త్రాలంకరణ వేడుకలలో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒడ్డెర కాలనీలో జరిగింది. క్షతగాత్రులను స్థానికులు చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు.
జిల్లా కేంద్రంలోని ఒడ్డెర కాలనీలో జరుగుతోన్న నూతన వస్త్రాలంకరణ వేడుకలలో లైటింగ్ కోసం కరెంటు తీగలను టెంటుపై నుంచి విసిరారు. ఈ క్రమంలో అవి సిమెంటు ఫాక్టరీకి విద్యుత్ సరఫరా అవుతున్న 132 కే వీ వైర్లను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరిగిందో తెలిసేలోపే ప్రమాదం జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంనేందుకు విద్యుత్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి: 'పద్య ప్రభంజనం' గ్రంథాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత