ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరంలో దొంగనోట్లు మారుస్తున్న పలువురిని పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ముగ్గురు వ్యక్తులు రెబ్బవరం గ్రామంలో కిరాణా దుకాణం వద్ద దొంగ నోట్లు చలామణి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
వైరా ఏసీపీ కె.సత్యనారాయణ, సీఐ వసంత కుమార్, ఎస్సై సురేష్ ఆ గ్రామానికి చేరుకొని ఆరా తీశారు. రూ 30,000 దొంగ నోట్లు మార్చి ఉండగా చాకచక్యంగా పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని దొంగనోట్లు చలామణిపై వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు.
ఇవీ చూడండి: టపాకాయల గోదాంపై తనిఖీలు.. యజమాని అరెస్టు