ETV Bharat / jagte-raho

విధుల్లో అనైతికంగా ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్​

మద్యం మత్తులో ఇద్దరు పోలీస్​ కానిస్టేబుళ్లు గొడవ పడిన ఘటన హైదరాబాద్​ చిలకలగూడలో చోటుచేసుకుంగి. ఈ నేపథ్యంలో ఘటనకు కారణమైన చిలకలగూడ కానిస్టేబుల్​ సుధాకర్​తోపాటు అనైతికంగా వ్యవహరించి... దుష్ప్రవర్తనకు పాల్పడిన మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సీపీ అంజనీకుమార్​ సస్పెండ్​ చేశారు.

three constables suspend in hyderabad commissionerate
విధుల్లో అనైతికంగా ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్​
author img

By

Published : Oct 28, 2020, 9:14 PM IST

సికింద్రాబాద్​ పరిధిలోని చిలకలగూడ పోలీస్​స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న సుధాకర్​.. బేగంపేట పీఎస్​లో ఏఆర్​ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న శరత్​కుమార్​తో కలిసి మద్యం సేవించారు. అనంతరం కుటుంబ సంబంధిత విషయాల్లో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ తగాదాల్లో శరత్​పై సుధాకర్​ దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లగా అతనిని సస్పెండ్​ చేస్తూ సీపీ అంజనీకుమార్​ ఉత్తర్వులు జారీ చేశారు.

శరత్​బాబుతో పాటు బహదూర్​పురా కానిస్టేబుల్​ బాబురావు, సిటీ ఆర్మ్​డ్​ రిజర్వ్​లో పనిచేస్తున్న కానిస్టేబల్​ శరత్​ను సీపీ అంజనీకుమార్​ విధుల నుంచి తొలగించారు. ప్రభుత్వం అందిస్తున్న వరదసాయానికి సంబంధించి కాలనీవాసులతో... బాబురావు గొడవపెట్టుకోగా కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరితో పాటు శరత్​ కూడా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా సస్పెండ్​ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి: నాగర్​కర్నూలులో ప్రేమ విఫలమై ప్రేమికుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.