మెదక్ జిల్లా నర్సాపూర్ లంచం కేసులో నగేశ్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు మూడో రోజు విచారిస్తున్నారు. బినామీ ఆస్తులకు సంబంధించి ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన అనిశా అధికారులు... వాటి గురించి నగేశ్‌ను ప్రశ్నిస్తున్నారు. నగేశ్ బినామీలను అనిశా ప్రధాన కార్యాలయానికి పిలిపించిన అధికారులు... వివరాలు సేకరిస్తున్నారు. బోయిన్పల్లి ఆంధ్రా బ్యాంకులో ఉన్న నగేశ్ లాకర్‌ను ఈ రోజు తెరిచే అవకాశం ఉంది. అందులో బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
75 లక్షలకు సంబంధించి 5 ఎకరాల భూమిని బినామీ జీవన్ గౌడ్ పేరుమీద అగ్రిమెంట్ చేయించున్న నగేశ్... 40లక్షల నగదును ఎక్కడ ఉంచాడని ఆరా తీస్తున్నారు. బాధితుడు లింగమూర్తి వద్ద నగేశ్... అప్పటి కలెక్టర్ ధర్మారెడ్డి పేరు పదేపదే ప్రస్తావించినందున... దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. ఈ కేసులో ఆయన పాత్ర ఏమేర ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్డీఓ అరుణా రెడ్డి, తహసీల్దార్ సత్తార్‌తో పాటు మరో ఇద్దరిని అనిశా అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చూడండి: మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంలో అనిశా సోదాలు