ETV Bharat / jagte-raho

బ్యాంకు దోపిడీకి విఫలయత్నం - latest crime news in telangana

దొంగలు బ్యాంకు దోపిడీకి విఫలయత్నం చేసిన ఘటన మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. సౌత్​ ఇండియా బ్యాంకు​ కిటికీ గ్రిల్స్​ను తొలిగించిన దొంగలు సైరన్​ మోగటంతో పారిపోయారు.

Thieves who attempted bank robbery in medchal distirct
బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
author img

By

Published : Sep 10, 2020, 10:41 AM IST

హైదరాబాద్ శివారులో తెల్లవారుజామున దొంగలు హల్​చల్ చేశారు. ఘట్​కేసర్ ఠాణా పరిధిలోని ఏదులాబాద్ మార్గంలో ఉన్న సౌత్ ఇండియా బ్యాంకు కిటికీ గ్రిల్స్​ను తొలిగించారు. సైరన్ మోగడం వల్ల భయపడిపోయిన దొంగలు‌ అక్కడ నుంచి పారిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. దొంగలు బ్యాంకు లోపలికి ప్రవేశించకపోవటంతో డబ్బులు పోలేదని‌ అధికారులు, పోలీసులు పేర్కొన్నారు. బ్యాంకును మల్కాజిగిరి ఏసీపీ‌ నరసింహ రెడ్డి, సీఐ‌ చంద్రబాబు పరిశీలించారు.

ఇదీ చూడండి. అంతర్వేది దేవస్థానానికి ప్రత్యేక అధికారి నియామకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.