ETV Bharat / jagte-raho

అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన దొంగ అరెస్ట్​ - హైదరాబాద్​ తాజా వార్తలు

అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన ఓ దొంగను హైదరాబాద్​ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ​31లక్షల నగదు, లాప్​టాప్, 4 చేతి గడియారాలు, రెండు వెండి గొలుసులు స్వాధీనం చేసుకున్నారు.

thief was arrested in hyderabad
అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన దొంగ అరెస్ట్​
author img

By

Published : Aug 7, 2020, 6:43 PM IST

హైదరాబాద్​ చార్మినార్​ ఠాణా పరిధిలోని ఓ దుకాణంలో మూడు రోజుల క్రితం చోరీకి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 31లక్షల నగదు, లాప్​టాప్, 4 చేతి గడియారాలు, రెండు వెండి గొలుసులు స్వాధీనం చేసుకున్నారు.

ఫలక్​నుమాకు చెందిన నసీర్ అనే యువకుడు హోటళ్లు, వస్త్రదుకాణాల్లో పనిచేసేవాడు. ఇటీవలే చార్మినార్ రికాబ్ బజార్​లోని ఓ దుకాణంలో పనికి కుదిరాడు. పక్కనే ఉన్న దుకాణం యజమాని.. నగదును కౌంటర్​లోనే ఉంచి వెళ్తాడని తెలుసుకున్న నసీర్.. దానిపై కన్నేశాడు. ఈ నెల 4న అర్థరాత్రి దుకాణం వెనుక తలుపు పగులగొట్టి.. లోపలికి ప్రవేశించి 35లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గతంలో ఇతనిపై పలు స్టేషన్లలోనూ చోరీ కేసులున్నాయి.

ఇవీచూడండి: భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.