హైదరాబాద్‌లోని ఇళ్లలో అర్ధరాత్రి వేళ చోరీలకు పాల్పడుతున్న దొంగను బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి కిలోన్నర వెండి వస్తువులు, 10 గ్రాముల బంగారం, రెండు ఖరీదైన వాచీలు, రెండు సెల్ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు ఇప్పటి వరకు నగరంలోని 4 ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. పలు వాహనాలు సైతం దొంగిలించినట్లు తెలిపారు. నిందితుడు గతంలోనూ 26 దొంగతనాలకు పాల్పడటంతో పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లొచ్చినట్లు వివరించారు. ఈ మేరకు నిందితుడిని రిమాండ్ తరలించినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల గల్లంతు.. ముమ్మరంగా గాలింపు