నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని నాలుగు గ్రామాల్లోని ఆలయాల్లో వరుస దొంగతనాలు జరిగిన ఘటన నూతనంగా వెలుగులోకి వచ్చింది. ఆలయాలకు తాళాలు వేసి ఉన్న సందర్భంలో దొంగలు పడి హుండీలను ఎత్తుకెళ్లారు.
కమలాపూర్, మోకన్ పల్లి, రెడ్డి ఫారం, సలీమ్ ఫారం గ్రామాల్లోని ఆలయాల్లోని హుండీలను కొల్లగొట్టగా.. ఒక హుండీలోని 30వేల నగదు అహరించారు. వీటిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!