మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ ప్రధాన రహదారిపై ఉన్న మొబైల్ దుకాణంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి షాపులో చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి.
చరవాణీల దుకాణం పైకప్పు రేకులను తొలగించి మరీ దుకారణం చొరబడి ఫోన్లు, బ్యాటరీలు మొత్తం సుమారు రూ. 20 వేల విలువ చేసే వస్తువులు ఎత్తుకెళ్లాడు. అదే మొబైల్ దుకాణంలో ఈ ఏడాదిలో ఇది రెండోసారి చోరీ జరగడం గమనార్హం. దుకాణదారు ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆన్‌లైన్ మోసం: ఏకంగా రూ.5.75 లక్షలకు టోకరా!