ETV Bharat / jagte-raho

బ్యాంక్​లాకర్​లో బంగారం మాయం.. ఎలా జరిగిందంటే.. - కృష్ణాజిల్లాలో సహకార బ్యాంకులో చోరి

ఏపీలోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరులోని సహకార బ్యాంకులో చోరీ కలకలం రేపింది. బ్యాంకు లాకర్‌లో 61గ్రాముల బంగారాన్ని దాచి పెట్టింది రాజేంద్రనగర్​కు చెందిన విజయలక్ష్మి. అయితే బ్యాంకు ఉద్యోగితో చేయి కలిపిన విజయలక్ష్మి కుమారుడు.. ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

బ్యాంకులో తల్లి దాచిన బంగారాన్ని అపహరించిన తనయుడు

author img

By

Published : Dec 25, 2020, 10:36 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరులో చోరీ జరిగింది. సహకార బ్యాంకు లాకర్‌లో 61 గ్రాముల బంగారం మాయం కలకలం రేపింది. గుడివాడ రాజేంద్రనగర్​కు చెందిన గుత్తా విజయలక్ష్మి.. తన తండ్రి కొల్లి నాగేశ్వరరావు కలిసి.. వేలేరు కోఆపరేటివ్ బ్యాంకు లాకర్​లో బంగారాన్ని దాచుకున్నారు.

బ్యాంకు సిబ్బంది యార్లగడ్డ మదన్​మోహన్​తో చేతులు కలిపిన విజయలక్ష్మి కుమారుడు గుత్తా సాయిహిరన్ చౌదరి.. తాత నాగేశ్వరరావు నుంచి దొడ్డిదారిలో తీసుకున్న తాళంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. తల్లి విజయలక్ష్మికి తెలియకుండా లాకర్​లోని బంగారాన్ని కాజేశాడు. దీనిపై విజయలక్ష్మి హనుమాన్ జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాయిహిరన్‌ చౌదరి ముత్తూట్‌లో తనఖా పెట్టి కొంత మొత్తాన్ని జల్సాలకు ఖర్చు చేసినట్లు గుర్తించారు. తనయుడితో పాటు బ్యాంకు ఉద్యోగి మదన్‌మోహన్​ను అరెస్టు చేసి బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: జగిత్యాల యాసిడ్ దాడి కేసులో ముగ్గురు అరెస్ట్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.