నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో రెండు రోజులుగా వరుసగా దొంగతనాలు జరిగాయి. ఆదివారం రాత్రి... ముధోల్లో ఒక మొబైల్ షాప్ చోరీ జరిగింది. మళ్లీ సోమవారం రోజు రాత్రి తరోడ గ్రామానికి చెందిన షేక్ మొయినుద్దీన్ ఇంట్లో దుండగులు దొంగతనానికి పాల్పడి 5 తులాల బంగారం... 20 తులాల వెండి, లక్ష 75వేల నగదును అపహరించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. తన సోదరి కొత్త ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బులు, బంగారం, వెండిని ఎవరో ఎత్తుకెళ్లారని.. బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి సోదరి ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఈ చోరీ జరిగిందని వెల్లడించారు.
ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'