ETV Bharat / jagte-raho

'ప్రియుడితో కలిసి నాయనమ్మ ఇంట్లో చోరీ.. చివరికి ఇలా దొరికింది' - Hyderabad Latest News

బాయ్​ఫ్రెండ్​తో కలిసి సొంత నాయనమ్మ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిందో మనమరాలు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరి నేరేడ్​మెట్​ పీఎస్​ పరిధిలో చేటుచేసుకుంది.

Theft at grandma's house with lover in Malkajgiri Nared Met
'ప్రియుడితో కలిసి నాయనమ్మ ఇంట్లో చోరీ.. చివరికి ఇలా దొరికింది'
author img

By

Published : Nov 4, 2020, 9:26 PM IST

మల్కాజిగిరి నేరేడ్​మెట్​ డిఫెన్స్​ కాలనీలో నివాసం ఉంటున్న అమిలియా అనే వృద్ధురాలి ఇంట్లో... ఈనెల 30న ఓ దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు జరిపిన విచారణలో మనమరాలే దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధరించారు. నిందితురాలు పెట్రిసియాకు నేరేడ్​మెట్​కు చెందిన అజయ్​ అనే యువకుడితో గత రెండేళ్లుగా ప్రేమలో ఉంది.

చెడు వ్యసనాలకు బానిసైన ప్రియుడు అజయ్​ డీజేగా పనిచేసేవాడు. అయితే లాక్​డౌన్​ కారణంగా పనులు లేక డబ్బులకు ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల ప్రేమికురాలి చైన్​ తీసుకుని అమ్మేశాడు. అప్పటికీ... డబ్బులు సరిపోకపోవడంతో ప్రియురాలితో కలిసి... వాళ్ల నాయనమ్మ ఇంట్లోనే 18 తులాల బంగారం దొంగతనం చేసి.. ఇద్దరు కటకటాల పాలయ్యారు. పోలీసులు నిందితుని వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్​కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.