జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధి హెచ్ఎమ్టీ కంపెనీ వద్ద ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం డ్రమ్ములో లభ్యమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన మహిళ యాచకురాలిగా పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫూటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి: పరీక్ష రాసి తిరిగి వెళ్తుండగా ప్రమాదం.. మహిళా వాలంటీర్ మృతి