కానిస్టేబుల్ మందలించాడని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ నగరంలో వెలుగు చూసింది. కరీమాబాద్‌కు చెందిన రాజు దుర్గేశ్వర స్వామి ఆలయం వద్ద రోడ్డు పక్కకు ఆగి ఉండగా మట్టెవాడకు చెందిన ఓ కానిస్టేబుల్ రాజుపై చేయి చేసుకున్నాడు.
తీవ్ర మనస్తాపానికి గురైన రాజు... ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని భావించగా.. మృతుడి భార్య పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. పోలీసుల దురుసు ప్రవర్తన వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని బోరున విలపించింది.
ఇదీ చూడండి: బల్దియా ఖజానా ఖాళీ.. జీతాల చెక్కులు వెనక్కి