ETV Bharat / jagte-raho

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి.. సబ్​స్టేషన్​పై గ్రామస్థుల దాడి - సూర్యాపేట జిల్లాలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం హెమ్లాతండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యుత్​ సరఫరా కావడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.

man died of electric shock in hemlathanda
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
author img

By

Published : Jan 7, 2021, 12:44 PM IST

అనుభవం లేని వ్యక్తితో లైన్​మెన్​ పని చేయించడం అతని ప్రాణాలను తీసింది. విద్యుదాఘాతానికి గురైన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం హెమ్లాతండాకు చెందిన భూక్యా నాగ మృత్యువాత పడ్డాడు.

నష్టపరిహారం ఇవ్వాలంటూ బంధువుల ఆందోళన :

విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయారు. హేమ్లాతండాకు చెందిన భూక్యా నాగ (23) విద్యుత్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయ విద్యుత్‌ లైన్‌లో జంపర్‌ను కలిపేందుకు లైన్‌మెన్‌ కృష్ణ అతన్ని తీసుకెళ్లాడు. నాగ విద్యుత్‌ స్తంభాన్ని ఎక్కి లైన్‌ కలుపుతుండగానే విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. ఘటనా స్థలి నుంచి లైన్‌మెన్‌ పరారయ్యాడు.

విషయం తెలుసుకున్న బంధువులు ఘటనా స్థలికి చేరుకుని.. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహన్ని రోడ్డుపైనే ఉంచి ప్రమాద ఘటనకు కారకుడైన కృష్ణపై దాడి చేశారు. ప్రమాదానికి కారకులైన విద్యుత్‌ సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించాలని, మృతుని కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మేళ్లచెరువు - కోదాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు అక్కడకు చేరి బాధితులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు.

ఇదీ చూడండి: హైకోర్టు సీజేగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణస్వీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.