ETV Bharat / jagte-raho

దారుణం: వరుసకు సోదరైన యువతిపై లైంగికదాడి - పశ్చిమగోదావరిలో చెల్లెని తల్లి చేసిన అన్నయ్య

అండగా ఉంటూ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కాటేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు. వావి వరసలు మరిచిపోయి వరసకు సోదరి అయ్యే యువతిపై అత్యాచారం చేసి.. ఆమె గర్భవతి కావడానికి కారణమయ్యాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండల పరిధిలో జరిగింది.

దారుణం: వరుసకు సోదరైన యువతిపై లైంగికదాడి

author img

By

Published : Jan 9, 2021, 11:00 PM IST

సోదరి వరుసయ్యే యువతిని అత్యాచారం చేసి, గర్భం దాల్చడానికి కారకుడయ్యాడు ఓ ప్రబుద్ధుడు. విషయం బయటకు రావటంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండల పరిధిలో జరిగింది. ఏలూరుకు చెందిన యువతి దెందులూరు మండలంలోని ఓ గ్రామంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వస్తూ ఉండేది. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్ నెలలో అమ్మమ్మ ఇంటిలో ఒంటరిగా ఉన్న ఆమెపై అదే గ్రామానికి చెందిన.. వరుసకు సోదరుడయ్యే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు.

ఈ క్రమంలో పలుసార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇటీవల బాధిత యువతి నీరసంగా ఉండటం గమనించిన ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భవతిగా గుర్తించారు. అనంతరం జరిగిన విషయాన్ని బాధిత యువతి తల్లికి చెప్పడంతో.. వారు దెందులూరు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: టిప్పర్​, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.