హైదరాబాద్ నుంచి ఛత్తీస్ఘడ్ జగదల్పూర్కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సమీపంలో అదుపుతప్పి పక్కకు ఒరిగింది. ముందుగా బస్సు రోడ్డు పక్కన ఉన్న బురదలోకి దిగిపోయి.... అనంతరం మెల్లగా పక్కకు జారీ కింద పడిపోయింది. తక్కువ మంది ప్రయాణికులు ఉండటం వల్ల ఎవరికి ప్రమాదం జరగలేదు. తరువాత బస్సును క్రేన్ సహాయంతో బయటకు తీశారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్