ETV Bharat / jagte-raho

నామినేషన్ల విషయంలో ఘర్షణ...నిమ్మాడలో ఉద్రిక్తత

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ కేంద్రానికి బయటి వ్యక్తులు ఎలా వస్తారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

tension-in-nimmada-with-election-nominations-in-srikakulam-district
నామినేషన్ల విషయంలో ఘర్షణ...నిమ్మాడలో ఉద్రిక్తత
author img

By

Published : Jan 31, 2021, 11:09 PM IST

నామినేషన్ల విషయంలో ఘర్షణ...నిమ్మాడలో ఉద్రిక్తత

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నామినేషన్ కేంద్రం వద్ద తోపులాట జరిగింది. తెదేపా ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడలో.. వైకాపా తరుఫున నామినేషన్ దాఖలు చేయడానికి కింజరాపు అప్పన్న వచ్చారు. వైకాపా మద్దతిచ్చిన అభ్యర్ధితో పాటు టెక్కలి సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ కేంద్రానికి వచ్చారు. బయటి వ్యక్తులను గ్రామానికి తీసుకురావడం ఏంటని నిమ్మాడ గ్రామస్థులు ప్రశ్నించారు. ఈ క్రమంలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు.

ఇవీచూడండి: శ్రీరాముడి పేరుతో భాజపా రాజకీయాలు: చల్లా ధర్మారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.