ETV Bharat / jagte-raho

పదివేల గుట్కా, పొగాకు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

author img

By

Published : Sep 21, 2020, 11:26 AM IST

నిషేధిత గుట్కా, పొగాకు పదార్థాలను విక్రయిస్తున్న షాపుల్లో హైదరాబాద్​ చిక్కడపల్లి పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా విక్రయాలు చేపడుతున్న పది వేల గుట్కా, పొగాకు ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

gutka packets seized by chikkadpally police
పదివేల గుట్కా, పొగాకు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

హైదరాబాద్​ చిక్కడపల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలోని పలు ప్రాంతాల్లో పాన్​ షాపుల్లో పోలీసులు తనిఖీ చేపట్టారు. చిక్కడపల్లి ఇన్​స్పెక్టర్​ పి. శివశంకర్​ పర్యవేక్షణలో 25 మంది పోలీసు సిబ్బందితో దాదాపు అరవై దుకాణాల్లో సోదాలు నిర్వహించారు.

నిషేధిత గుట్కా, పొగాకు అమ్మకందారులను పట్టుకుని వారిపై చట్టరీత్యా చర్యల నిమిత్తం పోలీస్​స్టేషన్​కు తరలించారు. దాదాపు పదివేల నిషేధిత గుట్కా, పొగాకు ప్యాకెట్లను పోలీసులు ఈ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండిః జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎక్సైజ్​ అధికారుల తనిఖీలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.