సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పదిమంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇంద్రేశం గ్రామ పరిధిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసామని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 1.29 లక్షలు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: దారుణం: కుమారుడి దాడిలో తల్లి మృతి