మంచిర్యాల జిల్లా కేంద్రం తిలక్ నగర్లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 25,860 నగదు స్వాధీనం చేసుకున్నారు.
తిలక్ నగర్లోని జాదవ్ రాహుల్ అనే వ్యక్తి ఇంట్లో రహస్యంగా డబ్బులు పందెం పెట్టుకొని పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేసినట్లు టాస్క్ఫోర్స్ సీఐ కిరణ్ తెలిపారు. మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: టాస్క్ఫోర్స్ దాడుల్లో.. నిషేధిత గుట్కా పట్టివేత