ETV Bharat / jagte-raho

దగ్గు మందు అమ్మినందుకు మెడికల్​షాప్​ యజమాని అరెస్ట్​ - crime news

హైదరాబాద్​ గోషామహల్​లో ప్రిస్క్రిప్షన్ లేకుండా అధికమొత్తంలో దగ్గు మందు అమ్ముతున్న వ్యక్తిని సెంట్రల్​ జోన్​ టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి 154 టానిక్​ సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

task force seized medical shop owner for selling calf syrup

author img

By

Published : Aug 8, 2020, 3:24 AM IST

మైనర్లకు, మత్తుకి అలవాటు పడిన వారికి అధికమొత్తంలో దగ్గు మందు అమ్ముతున్న వ్యక్తిని సెంట్రల్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్​లోని గోషామహల్ దారుస్సలాం వద్ద ఉన్న అగర్వాల్ మెడికల్ దుకాణంపై సెంట్రల్ జోన్ టాస్క్​ఫోర్స్​ పోలీసులు, డ్రగ్ డిపార్ట్మెంట్ అధికారులు దాడి చేశారు.

మందుల దుకాణం యజమాని జయంత్ అగర్వాల్​ను అదుపులోకి తీసుకున్నారు. దగ్గుకు సంబంధించిన 154 సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ టానిక్​ను అధిక మొత్తంలో వాడడం వల్ల ఆరోగ్యానికే ప్రమాదమని... వాటికి బానిసలుగా మారుతారని పోలీసులు వివరించారు. అనంతరం నిందితున్ని బేగంబజార్ పోలీసులకు అప్పగించారు.

ఇవీచూడండి: భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.