నిజామాబాద్ నగరంలో లక్కీ డ్రా పేరిట ప్రజలను మోసం చేస్తున్న ఓ ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు సంస్థ నిర్వాహకులు.. కేవలం ఒక్క నెలలోనే రూ. 34 లక్షలను సేకరించారని టాస్క్ఫోర్స్ సీఐ షాకీర్ అలీ వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం..
నగరంలోని లతా ఏజెన్సీ నిర్వాహకులు లక్కీ డ్రా పేరిట.. నెలకు కేవలం రూ. 12 వందలు చెల్లిస్తే విలువైన కార్లు, బంగారు ఆభరణాలను సొంతం చేసుకోవచ్చంటూ స్థానికులను నమ్మించారు. ఆ మేరకు ప్రజలను మోసం చేస్తూ.. ఒక్క నెలలోనే రూ. 34 లక్షలను సేకరించారని టాస్క్ఫోర్స్ సీఐ షాకీర్ అలీ వెల్లడించారు.
ఇదీ చదవండి: పేకాట ఆడుతుండగా గొడవ.. రాయితో కొట్టి హత్య