శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని ఎన్‌ఎండీసీ సర్కిల్ వద్ద ఓ గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా... ఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, వేలు ముద్రలు ఆధారంగా దర్యాప్తు చేస్తోంది. ఆమె వయస్సు 35-40 మధ్య ఉంటుందని భావిస్తున్నారు.
మహిళను ఎవరైనా హత్య చేసి గుర్తుపట్టకుండా ఉండటానికి తగలబెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆయిల్ ట్యాంకర్లో తరలిస్తున్న 900 కిలోల గంజాయి పట్టివేత