హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని ఓ పాఠశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తోటి విద్యార్థుల ర్యాగింగ్ భరించలేని 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని వెంటనే తల్లిదండ్రులు ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
గ్రీన్‌పార్కు కాలనీకి చెందిన ఓ బాలుడిని తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేసి డబ్బులు తీసుకుని రావాలని బెదిరించడం వల్ల తల్లిదండ్రులకు తెలియకుండా 6వేల రూపాయలు తీసుకెళ్లి ఇచ్చాడు. మళ్లీ డబ్బులు తేవాలని బెదిరించడంతో ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశాడని బాధితుని తల్లిదండ్రులు తెలిపారు. ప్రిన్సిపల్ ఈ విషయం పట్టించుకోలేదు. తోటి విద్యార్థుల బెదిరింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. విద్యార్థుల తీరుతోనే తన కుమారుడు సూసైడ్ నోట్ రాసినట్లు ఈ పని చేశాడని.. విద్యార్థి తండ్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: "సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలు కూల్చవద్దు"