ETV Bharat / jagte-raho

శ్రావణి కేసులో బయటపడ్డ ఫోన్​కాల్​ రికార్డులు.. దర్యాప్తు ముమ్మరం

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఎస్​ఆర్​నగర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డిని పోలీసులు మూడు రోజులుగా విచారిస్తున్నారు. శ్రావణికి తనకి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను దేవరాజ్​ పోలీసులకు సమర్పించాడు. శ్రావణి ఆత్మహత్య చేసుకునే రోజు ఆమె కుటుంబ సభ్యులు, సాయి కృష్ణారెడ్డి దూషించిన ఆడియోలను అందించాడు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం సాయికృష్ణారెడ్డిని ఎస్‌ఆర్ నగర్ పోలీసులు ప్రశ్నించనున్నారు.

Sravani case Phone call records leaked Investigation is going on sr nagar police station
శ్రావణి కేసులో బయటపడ్డ ఫోన్​కాల్​ రికార్డులు.. దర్యాప్తు ముమ్మరం
author img

By

Published : Sep 12, 2020, 7:53 PM IST

Updated : Sep 12, 2020, 10:24 PM IST

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసును ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ కేసులో అనుమానితుడిగా ఉన్న దేవరాజ్‌ రెడ్డిని పోలీసులు మూడో రోజూ విచారిస్తున్నారు. మరో అనుమనితుడిగా ఉన్న సాయి కృష్ణారెడ్డిని ఆదివారం ఉదయం విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే సాయికృష్ణా రెడ్డికి పోలీసులు నోటీసులు పంపినప్పటికీ శ్రావణి అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమంలో ఉన్నందున తర్వాత వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది.

శ్రావణిపై చేయి చేసుకోవడం

దేవరాజ్‌ సమర్పించిన ఫోన్‌ కాల్‌ రికార్డులతోపాటు అతడు పోలీసు విచారణలో చెప్పిన పలు విషయాలు ఆధారంగా సాయి కృష్ణారెడ్డిని ప్రశ్నించనున్నారు. ఆత్మహత్యకు ముందు శ్రావణి దేవరాజ్‌కు ఫోన్‌ చేయడం వల్ల ఆ సంభాషణకు సంబంధించిన ఆధారాలను కూడా అతడు పోలీసులకు అందజేశాడు. దీంతో ఆ రోజు ఇంట్లో పెద్ద గొడవే జరిగినట్టు పోలీసులు గుర్తించారు. శ్రావణిని కుటుంబ సభ్యులు, సాయి దూషించడంతోపాటు ఆమెపై కుటుంబ సభ్యులు చేయి చేసుకున్నట్టుగా ఫోన్‌ రికార్డులో ఉంది. ఆ సమయంలో శ్రావణి దేవరాజ్‌కు ఫోన్‌ చేసి అలాగే ఉంచడం వల్ల వారి మధ్య వాగ్వాదం.. దూషణలు.. సోదరుడు శ్రావణిపై చేయి చేసుకోవడం అన్నీ రికార్డయ్యాయి. వీటిని పోలీసులకు దేవరాజ్‌ అందజేయడం వల్ల కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. అలాగే, ఆత్మహత్యకు ముందు రోజు శ్రావణి-దేవరాజ్‌ ఓ రెస్టారెంట్‌లో ఉన్నట్టు తెలుసుకున్న సాయి అక్కడికి వెళ్లి ఆమెతో వాగ్వాదానికి దిగిన వీడియో ఫుటేజీని కూడా పోలీసులు సేకరించారు. ఈ ఆధారాలు సేకరించిన పోలీసులు అసలు ఆత్మహత్యకు దారితీసిన ప్రధాన కారణాలేమిటనే దానిపై ముఖ్యంగా విశ్లేషిస్తున్నారు.

కాల్‌ రికార్డింగ్‌ ఆధారాలు

ఈ కేసులో ఎవరిని నిందితుడిగా చేర్చాలనే అంశంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. అసలు శ్రావణి కుటుంబానికి, సాయి కృష్ణారెడ్డికి పరిచయం ఎలా ఏర్పడింది? శ్రావణితో అతడికి ఉన్న స్నేహమేంటి? కుటుంబ సభ్యులతో కలిసి ఆమె పట్ల సాయి అలా ప్రవర్తించడానికి కారణాలు ఏమిటి? దేవరాజ్‌తో ఆమె సన్నిహితంగా ఉంటే ఎందుకు కోపం వచ్చింది? దేవరాజ్‌ను ప్రశ్నించడం.. బెదిరింపులకు పాల్పడటం ఎందుకు చేశాడు తదితర కోణాల్లోనూ విచారించి అన్ని అంశాలను విశ్లేషించి ఈ కేసులో ఓ స్పష్టతకు రానున్నారు. దేవరాజ్‌ వ్యవహార శైలి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందంటూ అతడిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో.. మూడు రోజులుగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, శ్రావణికి కుటుంబ సభ్యులు దూషించడం, కొట్టడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందన్న కాల్‌ రికార్డింగ్‌ ఆధారాలను దేవరాజ్‌ పోలీసులకు సమర్పించాడు. ఈ నేపథ్యంలో సాయి కృష్ణారెడ్డిని ప్రశ్నించిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.

ఇదీ చూడండి : రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతి

Last Updated : Sep 12, 2020, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.