ETV Bharat / jagte-raho

శబ్ద కాలుష్యంపై పోలీసుల ఆగ్రహం... వాహనాలు సీజ్‌ - ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్ వార్తలు

రహదారులపై శబ్ద కాలుష్యానికి పాల్పడుతోన్న ద్విచక్ర వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్‌ చేశారు. ఈ నెలలో ఇప్పటి వరకు 1,134కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బైకులు కొనే సమయంలో ఉన్న సైలెన్సర్లను తీసివేసి.. ఎక్కువ శబ్దం వచ్చే వాటిని అమర్చుకుంటున్నట్లు గుర్తించామన్నారు.

Sound Pollution Bikes Seized by traffic police at kbr park in hyderabad
శబ్ద కాలుష్యానికి కారణమయిన ద్విచక్ర వాహనాలు సీజ్‌
author img

By

Published : Jan 30, 2021, 7:14 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వద్ద నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. రహదారులపై శబ్ద కాలుష్యానికి కారణమవుతోన్న ద్విచక్ర వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్‌ చేశారు.

ఈ నెలలో ఇప్పటి వరకు 1,134 శబ్ద కాలుష్యానికి సంబంధించిన కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బైకులు కొనే సమయంలో ఉన్న సైలెన్సర్లను తీసివేసి.. ఎక్కువ శబ్దం వచ్చే వాటిని అమర్చుకుంటున్నట్లు గుర్తించామన్నారు.

శబ్ద కాలుష్యంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మొదటిసారి సౌండ్ పొల్యూషన్​కి పాల్పడితే రూ.1000 జరిమానా, రెండోసారి పట్టుబడితే రూ.2000 జరిమానా విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఎలాంటి వాహనాలు అయినా సౌండ్ పొల్యూషన్​కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: పోషించలేక ఐదురోజుల శిశువును అమ్మేసింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.