ETV Bharat / jagte-raho

ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య.. ఎందుకో తెలుసా? - కాకినాడ తాజా వార్తలు

ఆసుపత్రి బిల్లు ఎక్కువ వచ్చిందని తండ్రి మందలించాడు. మనస్తాపానికి గురైన కుమారుడు ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగింది.

son-suicide-in-east-godavari-dst-kakinada-due-to-matter-of-hospital-bill
ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?
author img

By

Published : Jul 18, 2020, 1:36 PM IST

ఆసుపత్రి బిల్లు విషయంలో తండ్రి మందలించాడని అనారోగ్యంతో ఉన్న కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగింది. అపెండిసైటిస్ చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన తాళ్లరేవుకు చెందిన మండవల్లి సత్య వెంకట కృష్ణను.. హాస్పిటల్​ బిల్లు విషయంలో వృథా ఖర్చు ఎక్కువయిందని తండ్రి మందలించాడు.

మనస్తాపానికి గురైన బాలాజీ చెరువు సెంటర్​లోని సాయిసుధ ఆసుపత్రి 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం నిండు ప్రాణాలు బలి కొనటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయంపై కాకినాడ మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: 35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.